రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింతారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే హైదరాబాద్ ఎంపీ స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఎంఐఎం పార్టీకి ఈసారి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీనిచ్చారు.
హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆధిక్యంలో ఉన్నారు. మాధవీలత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒకవేళ మాధవీలత గెలిస్తే తెలంగాణ చరిత్రలోనే హైదరాబాద్ ఫలితం రికార్డు సృష్టించినట్లవుతుంది. మరి ఈ ఎన్నికల్లో గెలుపెవరిదో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.