హైదరాబాద్ మెట్రో మరో ఘనత..!

-

హైదరాబాద్ మెట్రో రైలు మరో రికార్డు సృష్టించింది. ఈ హైదరాబాద్ లో మెట్రోని 2017 నవంబర్ 28 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక మెట్రో మొదటి విభాగం మియాపూర్- అమీర్‌పేట – నాగోల్‌ ను ప్రారంభించారు. 2018 లో, రెండవ విభాగం అమీర్‌పేట్ – ఎల్.బి. నగర్‌ సర్వీస్ స్టార్ట్ చేశారు. అయితే మూడవ విభాగం అమీర్‌పేట్-హిటెక్ సిటీ (10 కి.మీ) 2019 మార్చి 20 న ప్రారంభించబడింది. హైటెక్ సిటీ నుండి రాయదుర్గ్ వరకు మరో 1.5 కిలోమీటర్ల విస్తీర్ణం గల సర్వీస్‌ను గత ఏడాది నవంబర్ ‌లో ప్రవేశపెట్టారు. హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజూ 780 ట్రిప్పులతో నాలుగు లక్షలకు పైగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు.

Metro
Metro

తాజాగా హైదరాబాద్ నగరవాసులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది. ఆరో తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్ 2020లో హైదరాబాద్ మెట్రోకు 8 అవార్డులు వచ్చాయని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పర్యావరణంతో పాటు పచ్చదనానికి మెట్రో కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ట్రాఫిక్ లేకుండా చల్లటి ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోందని ఎన్వీ‌ఎస్ రెడ్డి అన్నారు.

ఇక తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్‌ కు 8 విభాగాలకు ఎంట్రీలు పంపగా అన్నింట్లోనూ మెట్రోకు అవార్డులు వచ్చాయని ఎన్వీఎస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మెట్రో పరిసరాల్లో పచ్చదనం పెంపునకు దక్కిన గౌరవం ఇదని అన్నారు. గార్డెన్ ఫెస్టివల్లో నాలుగు సంవత్సరాలుగా మెట్రో ఎన్నో అవార్డులు గెలుస్తూ వస్తోందని అన్నారు. మెట్రో పరిసరాల్లో మొక్కల పెంపకం, గార్డెన్ల ఏర్పాటుతో ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఈ అవార్డులను మెట్రో సీనియర్ హార్టీకల్చర్ అధికారి సాయినాథ్ డిసెంబర్ 6న పబ్లిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో తీసుకుంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news