దేవుడా: అంతుచిక్కని అనారోగ్యం.. ఆ దేశం పనేనా..!?

-

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో కొత్తకొత్త వ్యాధులు కూడా అంతే వేగంగా పుట్టుకొస్తున్నాయి. ఇక ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా విదేశాల్లో పని చేస్తోన్న అమెరికా దౌత్యవేత్తలు, గూడాఛారులు అంతుచిక్కని రీతిలో అనారోగ్యం బారిన పడుతున్నారు. మైకం, అలసట, తలనొప్పి, వినికిడి శక్తి కోల్పోవడం, మెమరీ పవర్ తగ్గడం.. తదితర సమస్యలతో అమెరికా అధికారులు ఇబ్బందులు పడ్డారు. క్యూబాతోపాటు, చైనా, రష్యా తదితర దేశాల్లో పని చేస్తోన్న అమెరికా అధికారులు ఇలా అనారోగ్యానికి గురయ్యారు.

news vyadhi
news vyadhi

అయితే వీరిలో కొందరైతే ఆరోగ్యం సహకరించకపోవడంతో పదవీ విరమణ పొందాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు.. 2016లో హవానాలోని అమెరికా ఎంబసీకి చెందిన సిబ్బంది ఇలా మొదటిసారి అనారోగ్యం బారిన పడ్డారు. విదేశాల్లోని ఎంబసీలకు వెళ్తున్న సీఐఏ ఏజెంట్లు సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. ఇతర దేశాల నిఘా సంస్థలతో కలిసి రష్యా చేపడుతున్న కోవర్ట్ ఆపరేషన్లకు చెక్ పెట్టడం కోసం చర్చలు జరపడానికి వెళ్లిన ఇలా అనారోగ్యానికి గురయ్యారు.

ఇక తమ దౌత్యవేత్తలు, గూఢచారులు అనూహ్యంగా అనారోగ్యం బారిన పడటం వెనుక రష్యా హస్తం ఉందేమోనని అమెరికా అనుమానించింది. హవానా సిండ్రోమ్‌గా పిలిచే ఈ సమస్యకు మైక్రోవేవ్ దాడి కారణం కావొచ్చని 19 మంది సభ్యులతో కూడిన నేషనల్ అకడమిక్స్ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ నివేదిక అభిప్రాయపడింది. ‘డైరెక్టెడ్, పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ’ కారణంగానే ఈ అనారోగ్యం తలెత్తిందని కమిటీ రిపోర్ట్ వెల్లడించింది. విదేశాల్లోని తమ అధికారులను లక్ష్యంగా చేసుకొని.. ఉద్దేశపూర్వకంగా ఇలా దాడి చేశారని తెలిపింది. ఈ దాడికి కారణం ఎవరనేది ఆ నివేదిక బహిర్గతం చేయలేదు గానీ.. పల్స్‌డ్ రేడియో ఫ్రీక్వెన్సీపై రష్యా చేసిన పరిశోధనలను మాత్రం ప్రస్తావించింది.

Read more RELATED
Recommended to you

Latest news