హైదరాబాద్​ నలువైపులా మెట్రో.. కొత్త కారిడార్లు ఇవే

-

హైదరాబాద్ నగరం నలువైపులా మెట్రో తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. భవిష్యత్ లో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ మెట్రోను నాలుగు కారిడార్​లుగా విభజించినట్లు చెప్పారు. ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్- తుక్కుగూడ జంక్షన్-బొంగులూరు జంక్షన్ – పెద్ద అంబర్ పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్లలో 5 స్టేషన్​లు ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఈ కారిడార్ నిర్మాణానికి రూ.5,600 కోట్లు, ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పేట జంక్షన్-ఘట్ కేసర్ జంక్షన్-షామీర్ పేట్ జంక్షన్-మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లలలో 5 స్టేషన్​లు వస్తాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.6,750 కోట్లు, ఓఆర్ఆర్ మేడ్చల్ జంక్షన్-దుండిగల్ జంక్షన్-పటాన్ చెరు జంక్షన్ వరకు 29కిలోమీటర్లలో 3 స్టేషన్లు వస్తాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.4,785 కోట్లు, ఓఆర్ఆర్ పటాన్ చెరు జంక్షన్- కోకాపేట జంక్షన్ -నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్లలలో 3 స్టేషన్​లు ఉంటాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3,675 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మొత్తం ఈ నాలుగు కారిడార్లను 136 కిలోమీటర్లలో ఏర్పాటు చేస్తామని 16 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని, వీటి నిర్మాణానికి సుమారు రూ.20,810 కోట్లు అవసరం అవుతాయన్నారు.

ఎక్కడ నుంచి ఎక్కడి వరకు దూరం(కిలోమీటర్లలో)
శంషాబాద్‌ పెద్దఅంబర్‌పేట 40
పెద్దఅంబర్‌పేట మేడ్చల్‌ 45
మేడ్చల్‌ పటాన్‌చెరు 29
పటాన్‌చెరు నార్సింగి 22
ఎల్బీ నగర్‌ పెద్దఅంబర్‌పేట 13
శంషాబాద్‌ షాద్‌నగర్‌ 26
తార్నాక ఈసీఐఎల్‌ 8
జేబీఎస్‌ తూంకుంట 17
ప్యాట్నీ కండ్లకోయ 12

 

Read more RELATED
Recommended to you

Exit mobile version