మెట్రో ట్రిప్పుల్లో కోత.. ప్రయాణికుల పడిగాపులు

-

హైదరాబాద్ మెట్రో వచ్చిన తర్వాత నగర ప్రయాణికులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ట్రాఫిక్ జామ్ నుంచి సేద తీరుతున్నారు. కానీ ఇటీవల మెట్రో తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ట్రిప్పులు తగ్గించడంతో మెట్రోరైలు కారిడార్‌-2 జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ ప్రయాణికులు ఉసూరుమంటున్నారు.

గ్రీన్‌ లైన్‌లో క్రమంగా మెట్రో రైలు ప్రయాణ ట్రిప్పులను తగ్గించుకుంటూ వస్తున్నారు. మొదట్లో ఏడు నిమిషాలకు ఒక సర్వీసు నడిపినా.. ప్రయాణికులు తక్కువగా ఉంటున్నారని 12 నిమిషాలకు మార్చారు. అయినా ప్రయాణించేవారు ఓపిగ్గా ఎదురుచూసేవారు. ఇప్పుడు ఏకంగా 15 నిమిషాలకు, కొన్నిసార్లు 17 నిమిషాలకు ఒక మెట్రో వస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఫ్రీక్వెన్సీ తగ్గింపుతో ప్రయాణికులు మరో సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రసాద్‌ వారం రోజుల క్రితం మూసాపేట నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వెళ్లేందుకు మెట్రో ఎక్కారు. నేరుగా టిక్కెట్‌ తీసుకున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ స్టేషన్‌లో దిగి పక్కనే ఉన్న జేబీఎస్‌ మెట్రోకి చేరుకునే సరికి అప్పుడే ఎంజీబీఎస్‌కు మెట్రో వెళ్లింది. దీంతో ఆయన మరో సర్వీసు వచ్చేవరకు 15 నిమిషాలు ఎదురుచూడక తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version