నైజీరియన్ పై హైదరాబాద్‌ పోలీసుల నజర్‌..డోర్లు పగులకొట్టి మరీ !

-

నైజీరియన్ పై హైదరాబాద్‌ పోలీసుల నజర్‌ పడింది. రాజేంద్రనగర్, నార్సింగీ లో కార్డెన్ అండ్ సెర్చ్ చేస్తున్నారు పోలీసులు. సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో కొనసాగుతోంది ఆపరేషన్. నైజీరియన్స్ ఉంటున్న ఇండ్లలో కొనసాగుతున్న సోదాలు చేస్తున్నారు. నైజీరియన్ లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. పాస్ పోర్ట్, వీసాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Hyderabad Police Nazar on Nigerian

వీసా గడువు ముగిసినా, అక్రమంగా తెలంగాణ రాష్ట్రం లో ఉంటున్నట్లు గుర్తించిన వారి పై చర్యలు తీసుకుంటున్నారు.సన్ సిటీ అడ్డాగా చేసుకున్న నైజీరియన్స్, ఇక్కడి నుండే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదర్శాకోట్ లోని సన్ సిటీలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ చేశారు. ఈ సందర్భంగా ఓ అపార్ట్మెంట్లో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. అపార్ట్మెంట్లోని ప్లాట్లో ఉంటున్న నైజీరియా కు చెందిన ఇద్దరు అక్క చెల్లెల వద్ద నుండి పౌడర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news