పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పోలీసు శాఖ. మార్చి 1 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెండింగ్ చలాన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో రిబేట్ ప్రకటించారు తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే 2 వీలర్ వాహనదారులు పెండింగ్ ఛలాన్లో 25 శాతం చెల్లింపునకు అవకాశం కలించారు పోలీస్ శాఖ అధికారులు.
అంటే మిగత 75 శాతాన్ని మాఫీ చేయబోతునాన్రు పోలీస్ శాఖ అధికారులు. ఇక అటు కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆన్లైన్, మీసేవా, ఆన్లైన్ గేట్వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించానున్నారు పోలీస్ శాఖ అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ ఛలాన్లు ఉండిపోయాయి. పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేసేందుకు కొత్త ప్రతి పాదన తీసుకొచ్చారు పోలీస్ శాఖ అధికారులు. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించనుంది.