హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు, బయటకు రావొద్దని ఆదేశాలు !

హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహానగరంలో మరో రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. వాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ విధించిన నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు.

జిహెచ్ఎంసి సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది భారీ వర్షాల్లో చేపట్టాల్సిన చర్యల నిమిత్తం సంసిద్ధమయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు జిహెచ్ఎంసి అధికారులు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకి రావద్దని తెలిపారు.

ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. సంతోష్‌నగర్‌లో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి పవర్‌ కట్ అయింది. అయితే.. దీనిపై విద్యుత్‌ సిబ్బంది స్పందించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రామంతాపూర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం, మాదాపూర్‌లో 4.1, హఫీజ్‌పేట్‌లో 3.6, చార్మినార్‌లో 2.8, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.