బంగారం పేరుతో రూ.6 కోట్ల మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

-

బంగారంలో పెట్టుబడి అంటూ భారీ మోసానికి తెరలేపని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏకంగా రూ.6.12 కోట్లు మోసం చేసిన ఆ టెకీ చివరకు సైబరాబాద్‌ ఆర్థిక నేర విభాగం పోలీసులకు చిక్కాడు. బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కొండాపూర్‌లో నివాసముంటున్న గంట శ్రీధర్‌ బంగారంలో  బంగారం కోసం గ్రాముకు రూ.5,950 చొప్పున పెట్టుబడి పెడితే, సుమారుగా 25 రోజుల్లో బంగారం ఇస్తానని బాధితులకు తెలిపాడు. ఈ స్కీమ్‌ పట్ల ఆకర్షితులైన బాధితులు పెద్ద మొత్తంలో నగదును శ్రీధర్‌కు చెల్లించారు. అలా 13 మంది నుంచి రూ.6.12 కోట్లు తీసుకున్నాడు. గడువు తేదీ ముగిసినా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుల్లో ఒకరు సైబరాబాద్‌ ఆర్థికనేర విభాగంలో ఫిర్యాదు చేయడంతో విషయం బట్టబయలైంది. ఇలాంటి  స్కీమ్‌లకు ఆకర్షితులు కావొద్దని, ఇలాంటి నేరాలు జరిగితే తమను సంప్రదించాలని పోలీసు అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news