బంజారాహిల్స్ టాస్ పబ్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. అనుమతులు లేకుండా పబ్ నడుపుతున్న యజమాన్యం.. రెస్టారెంట్ అండ్ బారు పర్మిషన్ తీసుకొని పబ్బు నడుపుతున్నారు. పబ్బులో డాన్స్ ఫ్లోర్ ను ఏర్పాటు చేసి డబ్బులు లాగుతున్న నిర్వాకులు.. కస్టమర్లకు అమ్మాయిలను ఎరగా వేసి బిజినెస్ చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించినందుకు అమ్మాయిలకు కమిషన్ ఇస్తున్న యాజమాన్యం.. ఒక్కొక్క అమ్మాయికి ఐదు నుంచి పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు. అమ్మాయిలు చేత అర్ధనగ్న డాన్సులు చేయించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇక పబ్బుకు వచ్చే కస్టమర్లకు ఆకర్షించేందుకు అమ్మాయిలు చేత అనైతిక చర్యలు చేయిస్తున్న యాజమాన్యం.. మేల్ కస్టమర్ ఎంట్రీ ఫీజ్ 1000, ఆల్కహాల్ చార్జెస్ 500 లాంటి డబ్బులు లాగుతున్నారు. పెర్ఫార్మెన్స్ బట్టి అమ్మాయిలకు కమిషన్ ఇస్తున్నారు నిర్వహకులు. అయితే గతంలో ఊర్వశి బార్ , పబ్ 9 లో పట్టుబడ్డ అమ్మాయిలే బంజారాహిల్స్ టాస్ లో బిజినెస్ చేస్తున్నారు. అయితే 10 మంది అమ్మాయిల పై కేసు నమోదు చేసి రిమాండ్ చేసారు పోలీసులు.