జీవో నెం.29 పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఇప్పుడు గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గ్రూపు-1 పరీక్షలు జరుగుతాయా..? లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అభ్యర్థులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు ముఖ్యంగా విపక్షాల ట్రాప్ లో పడొద్దని సూచించారు.

జీవో నెం.29 పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ జీవోతో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఎందరో నిపుణులతో చర్చించిన తరువాతనే జీవో నెం.29ని తీసుకొచ్చామని తెలిపారు. జీవో నెం.29తో విద్యార్థులకు నష్టం లేదని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. గ్రూపు-1 విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతం అని.. అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కై అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version