హైదరాబాద్ మహా నగరం లో ఒక్క సారిగా వాతావరణం.. మారిపోయింది. ఉన్న ఫలంగా, హైదరాబాద్ మహా నగరం లో మబ్బులతో చీకట్లు కమ్ముకొచ్చాయి. ఈ తరుణంలోనే హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వాన పడుతూనే ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది.