హైదరాబాద్ లో మరో దారుణ హత్య..రెండు రోజులలో 6 హత్యలు, 2 రేప్‌ లు..!

-

హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంటెన్స్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లర్ నెంబర్ 19 అరవింద్ హాస్పిటల్ సమీపంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి కు తరలించారు పోలీసులు.

Hyderabad Realtor Found Murdered in Bidar

హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా పాతబస్తీలో వరుస హత్యలు…భయాందోళన రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 6 హత్యలు, 2 హత్యా యత్నాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ కు హత్య చేశారు దుండగులు. అక్రమ సంబంధం కారణంగానే జాకీర్ ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు… షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్ మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news