ఏపీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకోనున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే

-

ఏపీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు టీడీపీ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు. ఇవాళ రెండో రోజు ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అలాగే… ఉ.11గం.కు ఏపీ అసెంబ్లీ స్పీకరుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రకటించ నున్నారు బుచ్చయ్య చౌదరి. కొత్త స్పీకరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్నపాత్రుడు.

Senior MLA of TDP who will take charge as Speaker of AP

సభాపతి ఎన్నిక ప్రకటన.. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకరు ఛైరులో కుర్చొపెట్టనున్నారు సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకరును ఉద్దేశించి తొలుత సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగాలు కూడా చేస్తారు. ప్రసంగాలకు సమాధానం ఇవ్వనున్నారు కొత్త స్పీకర్‌. స్పీకర్ సమాధానం తర్వాత సభ నిరవధిక వాయిదా పడనుంది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news