‘హైడ్రా’ హైడ్రోజన్ బాంబులా తయారైంది.. హరీశ్ రావు సెన్షేషనల్ కామెంట్స్..!

-

తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా హైడ్రోజన్ బాంబులా తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ కి వచ్చిన హైడ్రా బాధితులను ఆయన పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడారు. మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల రక్తం, కన్నీళ్లను పారిస్తున్నారని పేర్కొన్నారు. పైసా పైసా వెనకేసుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లను రాత్రికి రాత్రి కూల్చివేస్తే.. పేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పనుల వల్లనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే పరిస్తితికి వచ్చిందన్నారు. అనాలోచితంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ముందుగా 100 రోజుల్లనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామనే అంశం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రజలంతా అంటు వ్యాధుల బారిన పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ప్రజలను తాము ఏనాడు ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. అఖిలపక్షాలతో మాట్లాడిన తరువాతనే ప్రభుత్వం మూసీ ప్రాంతాల్లో కూల్చివేతలపై ముందుకెళ్లాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news