మూసీని అభివృద్ధి చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి

-

మూసీని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. ఇవాళ గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా మూసీని అభివృద్ధి చేసే బాధ్యత  తనదని.. ఇందుకు సంబంధించి ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో పనులు చేస్తాం. హైదరాబాద్‌ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి.

హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి నగర అభివృద్ధికి మరింత చేయూతనిచ్చేలా ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. మూసీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మూసీ పరివాహక అభివృద్ధి కోసం లక్షా 50 వేల కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినప్పుడే ఇక్కడ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చాక గోపన్ పల్లి లాంటి ప్రాంతాలు ఎంతో ప్రగతి సాధించాయని, ఇక్కడ ఎకరా రూ. 100 కోట్లు పలుకుతుందని అన్నారు. మూసీని చూస్తే లండన్ ను తలపించాలని అన్నారు. మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా తీర్చిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news