రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

-

గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. శ్రీ మలయప్ప స్వామిని వజ్ర కవచం, కిరీటం.. ఇతర ఆభరణాలతో అలంకరిస్తారు. బంగారు గరుడవాహనంపై ఆయనను అధిరోహించి.. ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు పాల్గొంటుండగా సేవకులు చత్రం, చామరాలను పట్టుకుని తిరుమల వీధుల్లో ఊరేగిస్తారు.

గరుడ వరామ స్వామి ఆజ్ఞ ప్రకారం.. వెంకటాద్రి కొండను తీసుకొచ్చి తిరుపతి పక్కన ఉంచాడు. దీనిని ఇప్పుడు తిరుమల కొండలుగా పిలుస్తున్నారు. గరుడ పక్షి వేంకటేశ్వరుడి వాహనం.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ధ్వజరోహణంతో ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో జెండా ఎగురవేస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోను గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రసత్తికి తాను దాసుడని చెబుతారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news