వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని గర్వంగా చెప్పగలను – కేటీఆర్

-

ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పగలనని అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం హైదరాబాద్ శివారులోని జినోమ్ వ్యాలీలో బిఎస్వి కంపెనీ కొత్త యూనిట్ కి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33% హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని.. వచ్చే ఏడాది నుండి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడినుండే ఉత్పత్తి అవుతాయి అన్నారు.

దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదం అని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణ నెంబర్ వన్ అని, తలసరి ఆదాయంలోను తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఇక భారత్ సీరం సంస్థకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫెజ్ 3 లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాలలో విస్తరిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news