మేడిగడ్డ ప్రాజెక్ట్ వెన్నెముక ఇరిగిందని ముందే చెప్పాను : సీఎం రేవంత్ రెడ్డి

-

మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు. సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ పై సమీక్ష జరపలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్  అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసారని తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్య, కోతలు లేవన్నారు. కొన్ని చోట్ల వర్షాల వల్ల సదుపాయాల్లో అవాంతరాలున్నాయని చెప్పారు. పక్కా రాష్ట్రంలో పోలీస్ అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ ఫర్ చేశారని.. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ ఫర్ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని.. త్యాగాలు, పోరాటాలు గుర్తకొస్తాయన్నారు. అవే గుర్తుకు వచ్చే విధంగా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news