6 గ్యారెంటీలు అమలు చేస్తే.. తప్పకుండా రాజీనామా చేస్తా : హరీశ్ రావు

-

6 గ్యారెంటీలు అమలు చేస్తే.. తప్పకుండా రాజీనామా చేస్తానని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా ఆయన సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేసే అలవాట తనకు లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే.. తప్పకుండా రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణమని.. ఆయనకు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్ బాండ్ పేప‌ర్ బౌన్స్ అయింద‌న్నారు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ వ‌ద్ద ఇద్ద‌రి రాజీనామాలు ఉంచుదాం. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే త‌న రాజీనామా లేఖ పంపిస్తాను. స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ అంద‌జేస్తాను. పంద్రాగ‌స్టు లోగా ఆరు గ్యారెంటీలు, రుణ‌మాఫీ చేస్తే రాజీనామా ఆమోదించుకుంటాను. ఆ త‌ర్వాత‌ సిద్దిపేట‌కు రేవంత్ రెడ్డిని పిలిపించి శాలువాతో స‌న్మానం చేస్తాన‌ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version