కాంగ్రెస్ ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేస్తామని.. బీసీలకు న్యాయం చేస్తామని తెలిపారు  సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోడీ ఈ దేశాన్ని ఆదానీ, అంబానీ, కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారు. మోడీ హయాంలో దళితులు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తే.. చదువుకునే పిల్లలు ఎక్కడికి పోవాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుందన్నారు. అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందన్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారా..? అని బీజేపీని ప్రశ్నిస్తే.. మోడీ, అమిత్ షా తనపై కేసులు పెట్టారని.. ఢిల్లీ పోలీసులను తెలంగాణలోని గాంధీభవన్ కు పంపారని తెలిపారు. పసుపు బోర్డు గురించి మోడీ మాట్లాడాతారని అనుకున్నానని.. ఇవేవి చెప్పలేదని.. కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేశారు అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే.. రిజర్వేషన్లను రద్దు చేయడమేనా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news