ఓడినా గుణపాఠం రాకపోతే ఎలా కేటీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

ఎన్నికల్లో ఓడినా గుణపాఠం రాకపోతే ఎలా కేటీఆర్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదని సెటైర్లు వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం ఈజీయేనని.. ప్రజలు విజ్ఞులు కాబట్టి సీఎం కేసీఆర్ నే మార్చేశారంటూ.. ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కేటీఆర్ గతం నుంచి బయటికి రావాలని లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఆరోపించారు. 

మిషన్ భగీరథ అతిపెద్ద కుంభ కోణం అని.. కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో రూ.కోట్లు తినేశారంటూ ధ్వజమెత్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్సీ డెవెలప్ మెంట్ ఫండ్ గా మార్చి నిధులను మళ్లించారని ఆరోపించారు. నిధుల దారి మళ్లింపు చర్చకు రాకుండా చేసేందుకు దళిత బంధును తెరమీదకి తెచ్చారని వెల్లడించారు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందని.. అందుకే వారంతా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news