మద్దతు ధర, బోనస్ డబ్బులు పెండింగ్ ఉంటే రెండు రోజుల్లో చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

-

మద్దతు ధర, బోనస్ డబ్బులు పెండింగ్ ఉంటే రెండు రోజుల్లో చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు, మూడు రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వచ్చేలా చూసే ప్రభుత్వం మాదన్నారు. గత ప్రభుత్వంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు తట్టెడు మట్టి ఎత్తి పోయలేదు… రాజకీయ విమర్శలకు పోకుండా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

If support price and bonus money are pending, we will pay them within two days.

నిజామాబాద్‌లో ‘రైతు మహోత్సవం’ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాటాడారు.  కేసీఆర్ సర్కార్ సాగునీటిపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని.. అయినా అదనంగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వలేకపోయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిజాంసాగర్‌, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్‌ హయాంలోనేనని అన్నారు. లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news