ఏపీలో ప్రధాని మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారన్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈపాటికే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు. భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.

కాగా ఏపీ రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అమరావతి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో ఈ కమిటీని రూపొందించింది.