ఉప ఎన్నిక వస్తే పారిపోను.. పోరాడుతా : కడియం శ్రీహరి

-

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ కేటీఆర్ సంతోష పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ తో స్నేహం చేయడమే ఆప్ ఓటమికి కారణమని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే.. అధికారంలోకి వచ్చేవని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. 

ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. దీనిపై వచ్చే తీర్పును శిరసా వహిస్తానని కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నిక వస్తే.. పారిపోనని, నిలబడి పోరాడుతానని పేర్కొన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదని.. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ నే అని విమర్శించారు. ఎస్సీలకు జనాభా ప్రాతి పదికన 18 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కడియం శ్రీహరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news