కాంగ్రెస్ ప్రభుత్వం అలా కూలిపోతే మాకు సంబంధం లేదు : కిషన్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాత రాగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. వాళ్లు అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతే మాత్రం మాకు సంబంధం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఉద్దేశం బీజేపీకి లేదని కుండబద్దలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెప్పేది చేస్తుంది. చేసేది చెప్తుందని అన్నారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదని.. అందుకే అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. మణిపూర్ ఇష్యూ చాలా సెన్సిటివ్ అని.. ప్రాణనష్టం ఆపేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుదంటూ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీనే 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news