ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడితే లైవ్ తీసుకోవద్దంటూ హుకుం జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎవరైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడితే లైవ్ తీసుకోవద్దు అంటూ జర్నలిస్టులకు, కెమెరామెన్‌లకు అసెంబ్లీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లైవ్ తీసుకోవద్దంటూ ప్రభుత్వం హుకుం జారీ చేయడం దారుణమన్నారు. తమ ప్రభుత్వం ఇలాంటి విధానాలకు పాల్పడలేదన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి బయటేమో ఎన్ని గంటలు అయినా అసెంబ్లీలో చర్చించండి పేర్కొంటాడు. లోపలికి వెళ్లాక.. అసలు మైకు ఇవ్వకుండా ఉంటున్నారని.. అడిగే వరకు మైకు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లైవ్ తీసుకోవద్దని హుకుం జారీ చేయడం ప్రజల గొంతును వినపించేందుకు కూడా ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు.