రాష్ట్రంలో బీఆర్ఎస్ ని ఓడించాలంటే యువత పాత్ర ఎంతో కీలకమన్నారు బిజెపి మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు. కెసిఆర్ కి వ్యతిరేకంగా ఉన్న వర్గం యువత ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో వాళ్లే గేమ్ చేంజర్లు అని.. యువత మా వైపు వస్తే కేసీఆర్ ని అలవోకగా ఓడించేస్తామన్నారు.
కాంగ్రెస్ ని తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదన్నారు. ఆ పార్టీలో గెలిచినవారు కూడా ఆ పార్టీలో ఉండరనేది ప్రజలలో బలమైన అనుమానంగా ఉందన్నారు. బిజెపి తెలంగాణలో పెరిగే పార్టీ అని.. ఇతర పార్టీలు తగ్గే పార్టీలని అన్నారు. వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా పార్టీలో బాధ్యతలు మారుతాయన్నారు.