35 వేలు రుణం తీసుకుంటే.. 22 వేలు మాత్రమే మాఫీ.. రైతు ఆవేదన

-

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.2లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షన్నర వరకు రుణమాఫీ చేశారు. తాజాగా ఓ రైతు రుణమాఫీ పై ఆవేదన వ్యక్తం చేశాడు. “నేను 35 వేలు రుణం తీసుకుంటే.. 22 వేలు మాత్రమే మాఫీ అయ్యింది. అదేంటని బ్యాంకు వాళ్లని అడిగితే అంతే వచ్చింది నీకు అంటున్నారు. మోటర్లకు మీటర్లు పెడితే వ్యవసాయం బంద్ చేసుకొని కూలీకి పోవాల్సిందే.  ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంటుకు లాస్ తప్ప ఏం ఉపయోగం లేదు. అయిదు వందలకే గ్యాస్ అన్నోడివి 500 తీసుకోవాలి గ్యాస్ ఇవ్వాలి. కానీ 900 వందలు కట్టు మళ్లీ 400 బ్యాంకులో వేస్తా అంటే అది పడేది లేదు పాడు లేదు” అని రైతు వాపోయ్యాడు.

 

రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతులకు నష్టం అయితుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దు.. మీటర్లు పెడితే రైతులకు చాలా నష్టం అయితది. అప్పట్లో మా తల్లిదండ్రులు కరెంటు బిల్లులు కట్టాలంటే ఇంట్లో సొమ్ములు అమ్ముకునే వాళ్లు.  ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తది. అందుకే మోటర్లకు మీటర్లు పెట్టొద్దు.. బోనస్ సన్న వడ్లకు ఇస్తామంటున్నారు. సన్న వడ్లకే కాదు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు రైతు.

Read more RELATED
Recommended to you

Exit mobile version