Gottipati Ravikumar: రైతులకు 9 గంటల కరెంట్ అందిస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైందని తెలిపారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేశారని పేర్కొన్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో పుష్కలంగా వరద నీరు చేరడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుందన్నారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. దేశంలోనే విద్యుత్ మొదటిగా సంస్కరణ తీసుకువచ్చింది సిఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని వివరించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సంస్థను గాడిలో పెట్టి దేశానికే ఆదర్శవంతమవుతామన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.