ఐఐటీ అంటే రైట్ ఆఫ్ ఇండియా.. నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం

-

ఐఐటీలు అంటే రైట్ ఆఫ్ ఇండియాగా మారిందని, ఇక్కడ చదివే విద్యార్థులు, రీసర్స్ బృందం దేశ పురోగతికి ఎంతో సహకారాన్ని అందించాయని నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం కొనియాడారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్లో 13వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1100 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో డిగ్రీ సర్టిఫికెట్లను అందుకున్నారు. వారిని ఉద్దేశించి సుబ్రహ్మణ్యం మాట్లాడారు.

విజయాలు మనం తీసుకునే పట్టా సర్టిఫికేట్ లో ఉండదని, మనం సమాజానికి ఇచ్చే సమకారంలో చూపుతోందని నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని.. కోవిడ్ వంటి విపత్కరమైన సందర్భాల్లో ఐఐటీ విద్యార్థులు, రీసెర్చ్ బృందం అందించిన తమ సమకారాన్ని ఎన్నడూ దేశం మరిచిపోదని కొనియాడారు. వికసిత్ భారత్ లో భాగంగా 2024 నాటికి ప్రపంచంలోనే దేశ ఎకానమీ రెండో స్థానంలో నిలిచేలా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పారు. ఎక్కడలేని విదంగా భారతదేశంలో 45 కోట్ల మంది విద్యార్థులకు 15 లక్షల మంది ఫ్యాకల్టీలు ఉండి ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం, విద్యాభివృద్ధిలో దూసుకుపోవడం గొప్ప విషయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news