తెలంగాణలో జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత.. ఈ దాడులు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే.. పదిమందికి పైగా జర్నలిస్టులపై దాడులు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేసేస్తున్నారు.
అయితే తాజాగా…ఇల్లందులో జర్నలిస్ట్ నిట్టా సుదర్శన్‌పై హత్యాయత్నం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కాపుకాసి మారణాయుధాలతో దాడి చేసారు దుండగులు.
గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న తరపున ప్రచారం చేసిన సుదర్శన్ పై దాడి జరిగినట్లు చెబుతున్నారు.
ఇల్లందుకు చెందిన కొందరు రౌడీషీటర్లు, నాయకులతో తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఇక రక్తపు మడుగులో ఉన్న సుదర్శన్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం విషమంగా సుదర్శన్ పరిస్థితి ఉంది.