జల్ పల్లిలో అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ దందా.. సంచలన విషయాలు వెలుగులోకి..!

-

సాధారణంగా గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తుంటారు. కానీ కొందరూ గ్యాస్ విషయంలో ఏమాత్రం భయం లేకుండా అక్రమంగా గ్యాస్ ని రిఫిల్లింగ్ చేస్తూ దందా కొనసాగిస్తూ.. కాసులను సొమ్ము చేసుకుంటారు. అనుమతి లేకుండా ఇలా రీ ఫిల్లింగ్ చేయడం చట్ట రిత్యా నేరం అని అధికారులు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కొంత మంది మాత్రం పెడ చెవిన పెట్టకుండా ఈ దందాను అలాగే కొనసాగిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైనటువంటి జల్ పల్లి లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా బయటపడింది. గో గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ నుంచి భారత్, ఇండేన్ సిలిండర్స్ లోకి మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జనావాసాల మధ్య ప్రమాదకరంగా అక్రమంగా ఈ వ్యవహారం సాగుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు 100 గ్యాస్ సిలిండర్స్ స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వారిని పహాడిషరీఫ్ పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news