TS DSC (TRT) : టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ నెల 15న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. వివరాల్లో ఏమైనా తప్పులుంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్ కమ్ ఫోటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.

టెట్ పేపర్-1కి 1139, పేపర్-2కు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేపర్-1కి 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు వివరించారు.