తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్ష జూలై 2023 లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే TSPSC 8,180 గ్రూప్ 4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో పొందుపర్చారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయి? వంటి వివరాలను విడుదల చేశారు. మరిన్ని వివరాలకు https://websitenew.tspsc.gov.in/ వెబ్సైట్లో చూడండి.