ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి స్వతంత్రులు సిద్ధంగా ఉన్నారు : కిషన్ రెడ్డి

-

ఏపీలో అద్భుతమైన మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ విజయానికి సహకరించిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్డీఏకు స్వతంత్రులు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి లోక్​సభ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు.

బీజేపీపై విశ్వాసం ఉంచి.. అధికస్థానాల్లో గెలిపించారని కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీకి తెలంగాణ ప్రజలు 35 శాతానికిపైగా ఓట్లు వేశారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మాత్రమే పెరిగిందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభలో కాంగ్రెస్‌కు ఒక్కశాతం ఓటింగ్‌ పెరిగిందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు తమకు ఓటు వేశారని పేర్కొన్నారు. మోదీ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరిగాయని అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచిందని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version