మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 40 రోజుల పైగా సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ప్రచారంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక అడుగు ముందులో ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేకపోయాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి భారత రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎన్ఎక్స్ సర్వే సీఎం కేసీఆర్ కు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈ సర్వే వెల్లడించింది.
తెలంగాణలో మరోసారి కేసీఆర్ సర్కారు రాబోతుందని తేల్చిన ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సర్వే
ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సర్వేలో
బీఆర్ఎస్ – 70 సీట్లు
కాంగ్రెస్ – 34 సీట్లు
బీజేపీ – 7 సీట్లు
ఏంఐఎం – 7 సీట్లు
ఇతరులు – 1 సీటు