ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో వాయుగుండం చోటు చేసుకుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పారాదీప్ కు 780కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయింది. ఇవాళ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.
దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం దిశగా పయనించనుంది ఈ తీవ్ర వాయు గుండం. పశ్చిమ బెం గాల్, బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 60కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారుల వేటపై నిషేధం విధించారు అధికారులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అలర్ట్ ఉండాలని కోరారు అధికారులు.