జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

-

జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ప్రెస్ అకాడమీని తిరిగి ఓపెన్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ లో జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్, ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విధినిర్వహణలో చనిపోయిన, అనారోగ్యం బారిన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులను
అందజేశారు మంత్రి పొంగులేటి.

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  అర్హులైన జర్నలిస్టులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జర్నలిస్టులకు, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అలాగే మూతబడిన ప్రెస్ అకాడమిని ఈ నెల చివరిలోగా తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి హామీ
ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news