పాకిస్తాన్ పై ఓవైపు బలుచిస్తాన్, మరోవైపు భారత్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పై పాక్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ పై దాడి చేసినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లోని మొత్తం 6 స్థావరాలపై దాడులు చేసినట్టు తెలిపింది.
పార్లమెంట్ లో పాకిస్తాన్ ప్రధాని పై ఆ దేశ ఎంపీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాక్ పార్లమెంట్ లోనే పాకిస్తాన్ ప్రధానిని, ఆర్మీ చీఫ్ ను తిడుతూ ఓ ఎంపీ బూతులతో రెచ్చిపోయారు. యుద్దాన్ని ఎదుర్కోలేక పిరికిపందల్లా దాక్కున్నారని వారిపై విమర్వలు చేశారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు మరో షాక్ ఇచ్చారు. రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీప్ విఫలమయ్యారని ఈ పాలన తమకు వద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.