మిస్ వరల్డ్ పిస్కోవాతో సహా 111 దేశాల నుంచి సుందరీమణులంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ -2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భామలు, న్యాయ నిర్ణేతలు, అతిథులు అంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. భారత్ – పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాలపోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో నగరంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. శత్రుదేశాల ప్రతి నిధులతో పోటీలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చొరబాటు దారులను వెంటనే హైదరాబాద్ నుంచి వెనక్కి పంపించాలని విశ్వహిందూ పరిషత్ కోరింది.