రాములోరి సాక్షిగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు : డిప్యూటీ సీఎం భట్టి

-

రాములోరి సాక్షిగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చి మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.

సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామని  వెల్లడించారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే ఆరు గ్యారంటీలను ప్రకటించామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. భద్రాచలం అభివృద్ధికి తమ వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరోవైపు దళితులకు, గిరిజనులకు రూ.లక్ష అదనంగా అందజేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news