ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డం అరవింద్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సీనియర్ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందించారు. ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్కు చెప్పా అని అన్నారు. కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
కాగా, ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సీనియర్ నేత కె. కేశవరావు భేటీ అయ్యారు .పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు అని తెలుస్తోంది. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు అని మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. అయితే తాను కాంగ్రెస్లోనే చనిపోతానని కేకే చెప్పారు. ఇదిలా ఉంటే కేకే కుమారుడు మాత్రం టిఆర్ఎస్ పార్టీలో ఉంటానని వేరే పార్టీలోకి వెళ్లాలని తేల్చి చెప్పారు.