త్రిపుర గవర్నర్‌గా నియమించడం పట్ల బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకానికి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
“గవర్నర్‌గా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. బీజేపీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుంది అన్నారు. 40 ఏళ్లుగా బీజేపీలో పని చేస్తున్న నాకు ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. మూడుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మలక్ పేట వాసులకు ఈ గుర్తింపు దక్కుతుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అక్కడ టూరిజం డెవలప్మెంట్ బాగా జరుగుతోంది. మరింత అభివృద్ధికి దోహదపడేలా పనిచేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు” అని ఇంద్రసేనా రెడ్డి అన్నారు.