కాంగ్రెస్ పార్టీలో నేను సీఎం అయ్యే అవకాశం రావచ్చు – జానా రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీలో నేను సీఎం అయ్యే అవకాశం రావచ్చు అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చిన విషయం తెలిసిందే. అప్పటివరకు తెలంగాణలో పోటీలో లేనట్లుగా అనిపించిన కాంగ్రెస్…. ఒక్కసారిగా సరిగ్గా రేసులోకి దూసుకొచ్చింది.

పలువురు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరింత జోరు మీద ఉంది. దీంతో అధికారం తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవిపై జానారెడ్డి వాక్యాలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో నేను సీఎం అయ్యే అవకాశం రావచ్చు అన్నారు మాజీ మంత్రి జానా రెడ్డి. మొన్న కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి. పీవీ నర్సింహరావు ప్రధాని అయినట్లు నేను కాంగ్రెస్ పార్టీలో నేను సీఎం అయ్యే అవకాశం రావచ్చు అన్నారు జానారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news