ఇవాళ గులాబీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగనున్నాయి. హైదరాబాద్ మహానగరం తో పాటు తెలంగాణలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో… టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఆందోళనలకు పిలుపుఇచ్చింది. తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించింది.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం… ఉంచిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం పట్ల… మొదటినుంచి గులాబీ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి.. వివాదం పాలైంది. ఇక ఇవాళ… రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్పు నిరసనగా గులాబీ పార్టీ నేతలు… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపనున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి.. నిరసన తెలుపనున్నారు.