పాపులర్ ఫ్రంట్ నుంచి విడిపోయిన కొంత మంది కార్యకర్తలు ఇస్లామిక్ రాడికల్స్‌గా ఏర్పడి హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించిన విషయం తెలిసిందే. స్థానిక పోలీసుల సాయంతో ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఇంటెలిజెన్స్ బృందం.. దర్యాప్తులో భాగంగా ఇవాశ ఇవాళ భోపాల్‌కు చేరుకుంది.
భోపాల్ చేరుకున్న ఇంటెలిజెన్స్ టీమ్ ఇస్లామిక్ రాడికల్స్‌కు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ కేసులో నిందితులకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది. జోహార్‌నగర్‌కు చెందిన సల్మాన్‌పై కేసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు నివాసం ఉండే ప్రాంతాల్లో నిఘా పెట్టారు. నిందితులు ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడారనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక మసీదులకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నిందితులతో సన్నిహితంగా మెలిగిన వారి గురించీ ఆరా తీస్తున్నారు. అనుమానితుల వివరాలు సైతం పోలీసులు సేకరిస్తున్నారు