అయ్యో పాపం.. డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

-

గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది.

వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి (16) ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్‌ డే సందర్భంగా తోటి విద్యార్థులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తోంది. అంతలోనే ఉన్నట్టుండి.. ప్రదీప్తి కుప్పకూలింది. కళాశాలలో ఉన్న వైద్య సిబ్బంది సీపీఆర్‌ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తికి చిన్న వయసు నుంచే గుండెకు రంధ్రం ఉందని, శస్త్రచికిత్స జరిపించాలని అప్పట్లో వైద్యులు సూచించారని.. ఆర్థిక స్తోమత లేక శస్త్రచికిత్స చేయించలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news