హైదరాబాద్ లో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నమెంట్ !

-

International football tournament in Hyderabad: హైదరాబాదులో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నమెంట్ జరగనున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కు ప్లాన్‌ చేస్తున్నారట. హైదరాబాదులో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నమెంట్ జరిగితే.. సిరియా, ఇండియా, మాల్దీవులు పాల్గొననున్నట్లు సమాచారం.
ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన వచ్చిందని సమాచారం.

International football tournament in Hyderabad

ఇక అటు హైదరాబాదులో ఖేలో ఇండియాకు రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉంటాయట. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదనలు పంపిందని సమాచారం. ఆ మేరకు హైదరాబాదు స్టేడియంలను సిద్ధం చేస్తున్నామని కేంద్రానికి సమాచారం అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news