సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలి : పొంగులేటి

-

కేసీఆర్ మాటలను నమ్మే నేను మోసపోయానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఏరియాలో ఐఎన్టీయూసీ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2017 సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కేసీఆర్ మాటలు నమ్మి తాను మోసపోయానని అన్నారు. తనతో పాటు నమ్మిన కార్మికులు సైతం మోసపోవడమే కాకుండా కార్మికుల కష్టాలు విన్నవించుకునే సందర్భం కూడా మనకు దొరకలేదు అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి 12 ఏరియాలో 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కేసీఆర్ పార్టీకి బుద్ధి చెప్పామన్నారు.

ఏఐటిసి యూనియన్ కు చెందిన నాయకుని మొన్ననే మనం కొత్తగూడెం గెలిపించుకోవడం జరిగిందని కానీ వారు మాత్రం సింగరేణి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామంటూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కార్మికుల సొంత ఇంటి కల కోసం 20050 గజాల ఇళ్ల స్థలం 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం సింగరేణి కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులకు సెలవు దినం ప్రకటిస్తామని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని చూస్తుందని తెలిపారు. బిజెపి అనుబంధ సంస్థ బి.ఎం.ఎస్ కి కార్మికులు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news